వైరల్: తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి..

తెలంగాణకు చెందిన ఓ యువకుడు గ్రాడ్యుయేషన్ వరకు చదివాడు.. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశాడు. ఎలాంటి నోటిఫికేషన్లు వెలువడలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసీ విసిగిపోయిన ఓ యువకుడు సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. తెలంగాణ మిర్చి బండి పేరుతో మిర్చి బండి పెట్టుకున్నాడు. చదువుకుని ఉద్యోగాలు రాక కష్టాలు పడుతున్న ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలిచాడు.   

కరీంనగర్ కు చెందిన ఆర్.నరసింహా అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశాడు. సంవత్సరాలు గడుస్తున్న ఎలాంటి ప్రకటనలు రాలేదు. దీంతో ఇతర ఉద్యోగాలను పొందేందుకు సాంకేతిక విద్య ఐటీఐ కూడా పూర్తి చేశాడు. అయినా ఉద్యోగం లభించలేదు. 

దీంతో విసిగి పోయిన ఆ యువకుడు  ముకరంపురలోని దంగర్వాది స్కూల్ సమీపంలో తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి పేరుతో మిర్చి బండి ఏర్పాటు చేసుకున్నాడు. ప్రారంభంలో 10 ప్లేట్లు అమ్మకం కాగా.. ఇప్పుడు 250 నుంచి 300 ప్లేట్లు అమ్ముతున్నాడు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల రకు నిర్వహిస్తూ తనతో పాటు మరో నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నాడు. 

ఇక అతని వద్ద పనిచేసే యువకులు కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారే.. వారికి రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు అందజేస్తున్నాడు. అన్ని ఖర్చులు పోనూ అతనికి రోజుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు మిగులుతున్నాయట. ఎంతో మంది  ఉన్నత చదువులు చదివి ఉద్యోగం రాక ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారికి కరీంనగర్ యువకుడు ఆదర్శంగా నిలుస్తున్నాడు.   

Leave a Comment