వైరల్ వీడియో: బాకీ తిరిగి ఇమ్మన్నందుకు మహిళపై దాడి చేసిన ఆటోడ్రైవర్..!

గుంటూరు జిల్లాలో ఓ ఆటోడ్రైవర్ మహిళపట్ల దాష్టీకంగా ప్రవర్తించాడు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు మహిళ అనే కనికరం లేకుండా కాలితో కొట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. విజయవాడ రాణిగారి తోటలో నివసిస్తున్న గోవర్ధని అనే మహిళ తాడేపల్లి మహానాడులోని తాపీ మేస్త్రీ గోపీకృష్ణకు రూ.3 లక్షలు అప్పుగా ఇచ్చింది. 

కొంతకాలంగా తన అప్పు తీర్చమని ఆ మహిళ అడిగింది. అయినా గోపీకృష్ణకు పట్టించుకోలేదు. ఈక్రమంలో గోపీకృష్ణ మంగళగిరి మండలం రామచంద్రపురం సమీపంలో ఉన్నాడని తెలిసి ఆ మహిళ అక్కడికి చేరుకుంది.  తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని గోపీకృష్ణను నిలదీసింది. 

దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆటోలో కూర్చున్న గోపీకృష్ణ ఒక్కసారిగా మహిళను దూషిస్తూ ఆమెను కాలితో తన్నాడు. దీంతో ఆమె నాలుగు అడుగుల దూరంలో పడిపోయింది. 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెను మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆమె ఫిర్యాదు మేరకు గోపీకృష్ణను అరెస్ట్ చేశారు. 

 

Leave a Comment