డిగ్రీ చదివి బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్.. తెలంగాణ యువతి వీడియో వైరల్..!

తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో చూస్తే అర్థమైపోద్ది.. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితిపై ఓ యువతి వీడియో తీసింది. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాస్తున్నట్లు ఆ యువతి చెబుతోంది.. 

‘హాయ్ ఫ్రెండ్స్.. బర్రెలుగాయనీకి వచ్చిన ఫ్రెండ్స్.. ఎంత చదివిన గానీ డిగ్రీలు.. డిగ్రీలు.. మెమోలు వస్తాయ్ తప్ప జాబులైతే వస్తలేవు. నోటిఫికేషన్ వేయడు. ఏం వేయడు. అందుకే మా అమ్మను అడిగి గీ నాలుగు బర్లను కొన్నా.. రోజుకు ఓ బర్రె పొద్దున మూడు లీటర్లు.. సాయంత్ర మూడు లీటర్ల పాలు ఇస్తది..రూ.300 వస్తాయ్ ఫ్రెండ్స్.’ అంటూ యువతి చేసిన వీడియో ఆలోచింపజేస్తోంది.. తెలంగాణ వస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. 

Leave a Comment