తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..కరోనాకు ఉచిత వైద్యం..!

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా రోగులకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా తొలివిడతలో మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. ఈ మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితంగా అందించాలని నిర్ణయించింది. 

అంతే కాకుండా తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల డైట్ ఛార్జీలను కూడా పెంచుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు కరోనా బాధితులకు అందిస్తున్న భోజనానికి సాధారణ డైట్ కు రూ.40, హై ప్రోటీన్ డైట్ కు రూ.56 చెల్లిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు రూ.275 ఇవ్వాలని నిర్ణయించింది. అయితే జిల్లాల్లో రూ.200 గా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

Leave a Comment