కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయనం..!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 2021 మార్చి 31లోగా  కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

 దీంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలు కానున్నాయి. పార్లమెంట్ నియోజవర్గం సరిహద్దుగా ఈ జిల్లాలు ఏర్పాటు అవుతాయి. అంతే కాకుండా 26వ జిల్లా  ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగింది. అరుకు 4 జిల్లాలకు విస్తరించి ఉందని, ఈ నేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.  

Leave a Comment