ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశం ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో అజెండాలోని 22 అంశాలను కేబినెట్ చర్చించింది. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. 

కేబిజెన్ నిర్ణయాలు ఇవే..

  • రాయలసీమ ప్రత్యేక అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం. 
  • వైఎస్సార్ చేయూత పథకం కింద వెనుకబడిన వర్గాలకు చెందిన 25 లక్షల మంది మహిళలకు వర్తింపు.
  • పాఠశాలల నాడు-నేడు కార్య్రమానికి మొదటి విడతలో రూ.920 కోట్లను విడుదల. రానున్న రెండేళ్లలో అన్ని పాఠశాలల్లో అన్ని సౌకర్యాల కల్పన.
  • కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు.
  • ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ఒంగోలు, శ్రీకాకుళంలలో ఉద్యోగాల భర్తీ కోసం కేబినెట్ ఆమోదం.
  • సీపీఎస్ పెన్షన్ స్కీమ్ వద్దని ఆందోళన చేసిన ఉద్యోగులపై బనాయించిన కేసులను రద్దు చేయాలని నిర్ణయం.
  • మైనింగ్ కార్యక్రమాలకు సంబంధించి శాండ్ కార్పొరేషన్ పర్యవేక్షణ.
  • స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ లో 28 పోస్టుల భర్తీకి ఆమోదం.
  • 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్-2006 సవరణకు కేబినెట్ ఆమోదం.
  • రెన్యుబుల్ ఎనర్జీ ఎక్స్ పోర్ట్ విధానం-2020కి కేబినెట్ ఆమోదం.
  • రాయలసీమ ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, కాల్వల విస్తరణ పనుల కోసం స్పెషల్ పర్సస్ వెహికల్ కు కేబినెట్ ఆమోదం. దీని కోసం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కరువు నివారణా ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కేబినెట్ అంగీకారం.
  • గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రూ.145.94 కోట్లు విడుదలకు ఆమోదం.
  • దేశ చరిత్రలో తొలిసారి 9,712 వైద్యుల పోస్టుల భర్తీకి నిర్ణయం.
  • ఇసుకకు సంబంధించిన వ్యవహారాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం.

 

Leave a Comment