తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే.. బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర..!

తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం 68వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర సమర్పించారు. దాతల సహకారంతో రెండున్నర కిలోల బంగారంతో ఈ చీరను తయారు చేయించారు. 

బుధవారం ఉదయం ఎల్లమ్మ అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, తొమ్మిది గంటలకు మృత్యుంజయ హోమం, ఆయుష్సు హోమం నిర్వహించారు. అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు. ఉజ్జయినీ మహంకాళి, సికింద్రబాద్ గణేష్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

 

Leave a Comment