బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయవద్దు..!

ఉదయం నిద్ర లేవగానే చేసి పని బ్రష్ చేసుకోవడం.. కొంత మంది రోజుకు రెండు సార్లు.. మరి కొంత మంది ఇంకా ఎక్కువ సార్లు చేస్తుంటారు. అయితే రోజుకు ఎక్కువ సార్లు బ్రష్ చేసుకోవడం మంచిదేనా? రోజుకు ఎన్ని సార్లు బ్రష్ చేసుకోవాలి? బ్రష్ చేసేటప్పుడు చేసే పొరపాట్లు ఏంటీ? ఇప్పుడు తెలుసుకుందా..

బ్రష్ చేసేటప్పుడు కొంత మంది ఎక్కువ సేపు తోముతు ఉంటారు. కొందరు చాలా స్పీడ్ గా బ్రష్ చేస్తారు. అయితే ఈ రెండు మంచివి కాదని డెంటిస్టులు చెబుతున్నారు. రోజు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ సార్లు బ్రష్ చేస్తే పంటిపై ఉండే ఎనామిల్ తొలగిపోతుంది. అంతేకాకుండా పంటి సమస్యలు కూడా వస్తాయి. 

బ్రష్ చేసేటప్పుడు వెర్టికల్ గా చేయాలి. హారిజంటల్ గా చేయకూడదు.. దీని వల్ల ఇరిటేషన్, పళ్లు పాడయ్యే సమస్యలు వస్తాయి. అలాగే పళ్లు తోమేటప్పుడు బ్రష్ 45 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి. వేగంగా పై నుంచి కిందకు జరుపుతూ స్ట్రోక్స్ ఇవ్వొద్దు. ఇలా చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటే మీ పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా క్రిములు కూడా తొలగిపోతాయి. ప్రస్తుం ఆటోమేటిక్ బ్రష్ లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా పళ్లను శుభ్రంగా ఉంచుతాయి. ఆహారం తిన్నాక పళ్లను నీళ్లతో కడుక్కోవాలి. ఒకవేళ్ల ఎలాంటి పంటి సమస్యలు ఉన్నా వెంటనే డెంటిస్ట్ ని కలవాలి.  

Leave a Comment