బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏంటో తెలుసా?

మనిషి యొక్క ముఖ్యమైన అవయవాల్లో మెదడు కూడా ఒకటి. శరీరం మొత్తాన్ని నడిపేది ఈ అవయవమే. మెదడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు శరీరం అదుపుతప్పకుండా పనిచేస్తుంది. అలాంటి మెదడులో చిన్న సమస్య తలెత్తినా ‘బ్రెయిన్ స్ట్రోక’ ఏర్పడుతుంది. 

అయితే బ్రెయిన్ స్ట్రోక్ కు నెల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి. ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం బ్రెయిన్ స్ట్రోక్ కు ముందు వచ్చే సాధారణమైన లక్షణాలు. అయితే ముఖం, చేతులు, కాళ్లు ఒకవైపు మాత్రమే మొద్దుబారడం జరుగుతుంది. కంటి చూపులో కూడా సమస్య ఏర్పడుతుంది. నెల ముందు నుంచే కంటి చూపులో తేడా కనిపిస్తుంది. 

కళ్లు మసకబారడం లాంటివి ఉత్పన్నమవుతాయని యూకేలో 1300 మందిపై జరిపిన సర్వేలో తేలింది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన చాలా మంది ఆడవాళ్లలో కనిపించిన మరో లక్షణం తలనొప్పి. చాలా మంది తలవెనుక భాగంలోనే అలా అనిపించినట్లు ఉంటుంది. ఒక్కో సమయంలో స్పృహ కూడా కోల్పోయి పడిపోయే ప్రమాదం ఉంటుంది.

అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీ నొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ అని గుర్తించాలంటున్నారు. ఇక ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఓహియో స్టేట్ యూనివర్సిటీ వెక్సనర్ మెడికల్ సెంటర్ జరిపిన సర్వే ప్రకారం 10 శాతం మంది మహిళలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. 

ఈ స్ట్రోక్ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంటుంది. మహిళల్లో స్ట్రోక్ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. ఉన్నట్టుండి కొన్ని విషయాలు మర్చిపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు వస్తుంటాయి. అంతేకాకుండా వికారం, వాంతులు, మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు, వికారంగా ఉండటం వంటివి కనిపిస్తాయి. 

ఇక చూపులో సమస్యతో పాటు భ్రమ పడుతున్నట్లు కూడా అనిపిస్తుంటుందట. అప్పటికే పోస్టిరియర్ భాగంలో సర్యులేషన్ సమస్య వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ స్ట్రోక్ వచ్చే ముందు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దాని వల్ల మెదడులో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు గర్భస్రావాలు జరుగుతుంటాయి. అది స్ట్రోక్ రిస్క్ ను పెరిగేలా చేస్తుందని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ వెల్లడిస్తోంది. అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే డీహెచ్ఈఏ హార్మోన్ వెంటి తగ్గిపోతుంది. దాని కారణంగా ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్లు తగ్గిపోతుంటాయి. 

ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. అందుకే ఎక్కువగా టెన్షన్ కు గురికాకుండా ఉండటం మంచిది. అధికంగా ఆలోచించడం కంటే యోగా, ధ్యానం లాంటివి చేసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలని వెల్లడిస్తున్నారు. లేకపోతే ఇలా అనారోగ్యం బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Leave a Comment