‘ప్లీజ్ సార్.. వెళ్లొద్దు’..టీచర్ కోసం ఏడ్చిన విద్యార్థులు..!

స్కూల్ అంటేనే గుర్తుకొచ్చేది విద్యార్థులు.. ఉపాధ్యాయులు.. తరగతి గదులు.. అంతకు మించి.. గురుశిష్యుల బంధం.. అప్పటి వరకు తమతో ఉన్న ఉపాధ్యాయులు ఇక బడిని విడిచి వెళ్తున్నారంటే.. విద్యార్థులకు కన్నీళ్లు ఆగవు.. ఇక తమకు మరీ ఇష్టమైన గురువు వెళ్తుంటే.. ఏ విద్యార్థికి అయినా మనుసు ఒప్పుకుంటుందా? కానీ యూపీలోని ఓ పాఠశాలలో అదే జరిగింది.. స్కూల్ టీచర్ బదిలీపై వెళ్తుంటే.. విద్యార్థులు బరువెక్కిన హృదయంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.. 

రాయ్ గడ్ చందౌలీ ప్రైమరీ స్కూల్ లో నాలుగేళ్ల క్రితం శివేంద్రసింగ్ టీచర్ గా వచ్చారు. స్కూల్ లో పాఠాలు బోధించడంలో ఆయన తన ప్రత్యేకత చాటారు. పిల్లలకు ఆటలు, సోషల్ మీడియా, బొమ్మలు, పాటల ద్వారా పాఠాలు చెప్పేవారు. కేవలం పాఠాలు మాత్రమే కాదు.. ప్రపంచం గురించి కూడా వాళ్లకు వివరించేవారు. విద్యార్థులతో కలిసి కొండ ప్రాంతంలో క్రికెట్ ఆడేవారు. ఆయన చొరవతో స్కూల్ లో హాజరు శాతం కూడా పెరిగింది. 

 బదిలీల్లో భాగంగా విద్యాశాఖ ఆయనన్ను మరో స్కూల్ కు ట్రాన్స్ ఫర్ చేసింది. దీంతో మంగళవారం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే అక్కడి విద్యార్థులు ఆయన్ను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పిల్లలంతా చుట్టూ చేరి కన్నీళ్లతో హత్తుకున్నారు. ‘వెళ్లొద్దు సార్.. వెళ్లొద్దు సార్’ అంటూ రోదించారు.  దీంతో ఆయన పిల్లలను ఓదార్చారు. త్వరలోనే వస్తానని, బాగా చదువుకోవాలని, అందరూ బాగుండాలని కోరుకున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

Leave a Comment