చల్లగా ఉన్నప్పుడు అరటి పండు తినొచ్చా?

అరటి పండ్లు హెల్తీ ఫ్రూట్.. ఇందులో న్యూట్రీషన్లు అధికంగా ఉంటాయి..దీన్ని తినకుండా ఉండటానికి ఎలాంటి రీజన్స్ లేవు.. అయితే వాతావరణం చల్లగా ఉండే వర్షాకాలంలో అరటి పండును తినవచ్చ? పిల్లలకు తినిపించవచ్చ? అనేది చాలా మందికి కలిగే సందేహం.. 

 ఎందుకంటే వానాకాలంలో వ్యాధులు త్వరగా ప్రబలుతాయి. జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువ మందిని విధిస్తాయి. మరి చలువ చేసే అరటి పండును తినవచ్చా అంటే తినొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. రోజూ పండిన అరటి పండు తినాలని సూచిస్తున్నారు.   

ఇందులో అమైనో ఆమ్లాలు, విటమిన్ బి6, సి విటమిన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మెదడు పనితీరును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. స్ట్రోక్స్ ప్రమాదం కూడా తగ్గుతుంది. కాబట్టి వానాకాలంలో కూడా అరటిపండ్లు లాగించవచ్చు. 

వీరు తినకూడదు

అయితే కొన్ని జబ్బులు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా తర్వాతే తీసుకోవాలని అంటున్నారు.. అజీర్ణం, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు మాత్రం రాత్రి పూట అరటిపండ్లు తినడం మానేయాలి. ఇవి కఫదోషాన్ని పెంచుతుంది. శ్లేష్మం అధికంగా ఏర్పడేలా చేస్తుంది. అందుకే ఎప్పుడైనా ఉదయం పూట అరటిపండ్లు తినాలి. ఇలా తినడం వల్ల ఈ పండులో ఉండే ప్రొటీన్, ఫైబర్ జీర్ణం కావడానికి తగినంత సమయం ఉంటుంది.

అరటి పండు తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అయితే పిల్లలకు మాత్రం రాత్రి పూట దీనిని తినిపించకూడదు. రాత్రిపూట తినిస్తే కఫం పట్టే అవకాశం ఉంది. అందుకే ఉదయం పూట తినిపించడమే మంచిది. అయితే అరటి పండు తిన్న వెంటనే పాలు తాగకూడదు. అది విషపూరితంగా మారుతుంది. ఈ రెండూ జీర్ణవ్యవస్థలో యాసిడ్స్ రిఫ్లక్స్ చేస్తాయి. దీని వల్ల కఫదోషం పెరుగుతుంది. 

 

Leave a Comment