వాలంటీర్ల జోక్యం వద్దు.. ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..!

ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనవద్దని స్పష్టం చేసింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించకూడదని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ ఆదేశాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు తెలియజేయాలని చెప్పింది. 

వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే అని ఆ పార్టీ నాయకులు, మంత్రులు అనేక సందర్భాల్లో ప్రస్తావించారని పేర్కొటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఈనేపథ్యంలో ఓటర్ల జాబితా తయారీ, చీటీల పంపిణీ, పోలింగ్ కేంద్రాల ఎంపిక, పోలింగ్ విధులు, ఓట్ల లెక్కింపు వంటి విధుల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.  

 

Leave a Comment