టీ సిప్ చేస్తూ.. సిగరెట్ తాగుతున్నారా?.. ఈ వ్యాధి వచ్చే ప్రమాదం..!

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటున్నారు.. పని ఒత్తిడి వల్ల బ్రేక్ టైమ్ లో చాయ్ తాగుతూ, దమ్ము కొడుతుంటారు.. ఒక చేత్తో టీ గ్లాస్ పట్టుకొని.. మరో చేతిలో సిగరెట్ లాగిస్తుంటారు.. మరికొందరు మద్యం తాగేటప్పుడు కూడా సిగరెట్ పీల్చుతారు.. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదకరమట..

టీ తాగుతూ, ధూమపానం చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ చేసిన అధ్యయనం ప్రకారం టీ, ఆల్కాహాల్ తో పాటు సిగరెట్ తాగేవారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. ఇలా తాగేవారికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట.. 

సిగరెట్ తాగే వారు.. టీ కూడా ఎక్కువగా తాగుతుంటారు. రెండింటినీ కలిపి తీసుకోవాడానికి వారు ఇష్టపడతారు. ఈ రెండు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటే క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుందని అమెరికా యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. సిగరెట్, మద్యం అలవాటు లేనివారు.. టీ తాగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ రెండు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది..    

Leave a Comment