అచ్చెన్న గ్రామంలో టీడీపీ విజయం..!

పంచాయతీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా కోటమ్మాళి మండలం నిమ్మాడ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి అప్పన్నను బెదిరించారనే ఆరోపణలతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లివచ్చారు. అంతే కాదు నిమ్మాడ గ్రామంలో నాలుగు దశాబ్దాల తర్వాత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. 

ఇంతవరకూ నిమ్మాడ గ్రామంలో కింజరాపు కుటుంబ సభ్యుల మద్దతుతో ఏకగ్రీవంగానే ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తొలిసారిగా కింజరాపు కుటుంబానికి చెందిన మరో వ్యక్తి కె.అప్పన్న వైసీపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేయడంతో ఈ సారి నిమ్మాడలో పోలింగ్ జరిగింది. 

అప్పన్నను అచ్చెన్నాయుడు బెదిరించారనే అరోపణలతో జైలుకు వెళ్లిరావడంతో నిమ్మాడ ఫలితం ఉత్కంఠ రేపింది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన అచ్చెన్నాయుడు అన్నయ్య హరిప్రసాద్ కుమారుడు కింజరాపు సురేష్ 1700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సురేష్ కు 1857 ఓట్లు రాగా, వైసీపీ మద్దతుతో పోటీచేసిన కె.అప్పన్నకు 157 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

Leave a Comment