‘డీజిల్ కు డబ్బులిస్తే.. నీ కూతుర్ని వెతుకుతాం’.. ఓ తల్లికి పోలీసుల నిర్లక్ష్యపు సమాధానం..!

బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులే ఓ తల్లి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కిడ్నాప్ కి గురైన తన కూతుర్ని విడిపించాల్సిందిగా కోరుతూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఓ తల్లి పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. ఆమె వద్ద నుంచి రూ.15 వేలు వసూలు చేసి కూడా ఫిర్యాదును పట్టించుకోలేదు. పైగా ఆమె కూతురి క్యారెక్టర్ గురించి అసభ్యంగా మాట్లాడారు. చివరికి ఆ తల్లి వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు యూపిలోని కాన్పూన్ జిల్లాకు చెందిన గుడియా అనే దివ్యాంగురాలైన తన కుమార్తెలో జీవిస్తోంది. నెల రోజుల క్రితం కుమార్తెను ఆమె బంధువు ఒకరు కిడ్నాప్ చేశాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె కూతుర్ని వెతికేందుకు డీజిల్ పోయించాలని పోలీసులు తెలిపారు. 

దీంతో ఆ తల్లి ఎలాగోలా అప్పు తెచ్చి రూ.15 వేలు డీజిల్ ఖర్చులకు పోలీసులకు చెల్లించింది. ఇలా ఇప్పటికీ మూడు నాలుగు సార్లు డబ్బులు ఇచ్చింది. అయినా పోలీసులు ఆమె కుమార్తెను వెతకడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీని ప్రశ్నిస్తే ‘నీ కూతురు ఎలాంటిదో.. ఎవరితో వెళ్లిపోయిందో’ అంటూ అసభ్యంగా మాట్లాడారు.

దీంతో ఆమె తట్టుకోలేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దీనిపై స్పందించారు. స్టేషన్ ఎస్ హెచ్ఓను విధుల నుంచి తొలగించారు. అంతే కాక మరో అధికారిని నియమించి గుడియా ఫిర్యాదు మీద చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.  

 

Leave a Comment