రెండో పెళ్లి కోసం.. ‘హలో బ్రదర్’ స్టోరీ అల్లాడు..!

రెండో పెళ్లి కోసం ఓ వ్యక్తి సినిమా స్టోరీని అల్లాడు. తనకు పెళ్లయిందన్న విషయాన్ని దాచి, తనకు అచ్చంగా తనలాంటి కవల సోదరుడు ఉన్నాడని కాబోయే భార్యకు అబద్ధం చెప్పాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు చెన్నై, అరుబాక్కానికి చెందిన వాల్లండర్ బెన్నైట్ రెయాన్ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేసే 21 ఏళ్ల అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లికి అమ్మాయి తరపు వారు ఒప్పుకున్నారు.. కట్నంగా రూ.3.5 లక్షలు ఇచ్చారు. 

అయితే రెయాన్ కు ఇది వరకే పెళ్లయిందని, పిల్లలు కూడా ఉన్నారని పెళ్లి చేసుకునే అమ్మాయికి తెలిసింది. దీంతో ఆమె రెయాన్ ను ఈ విషయంపై నిలదీసింది. ఇక్కడే రెయాన్ ఓ అద్భుతమైన స్టోరీని అల్లాడు. తనకు అచ్చం తనలాంటి కవల సోదరుడు ఉన్నాడని అబద్ధం చెప్పాడు. 

అమ్మాయిని నమ్మించేందుకు నకిలీ ఓటర్ ఐడీ, ఆధార్, బర్త్ సర్టిఫికెట్ ను సైతం ఇచ్చాడు. తన కవల సోదరుడు పెళ్లి చేసుకుని దుబాయ్ లో ఉన్నాడని ఆమెకు చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత అమ్మాయి బంధువు ఒకరు మళ్లీ రెయాన్ పెళ్లి గురించి చెప్పారు. 

ఈసారి ఆమె కట్నం డబ్బులు వెనక్కు ఇవ్వాలని రెయాన్ ను డిమాండ్ చేసింది. దీంతో కోపంతో రెయాన్ యాసిడ్ దాడి చేస్తానని అమ్మాయిని బెదిరించాడు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ లో అతడిపై, అతడి తల్లిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న రెయాన్ కోసం గాలిస్తున్నారు. 

Leave a Comment