Tamilnadu Elections 2021 : సైకిల్ పై వచ్చి ఓటు వేసిన హీరో విజయ్..!

తమిళనాడులో మంగళవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తమిళ స్టార్ హీరో విజయ్ ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు సైకిల్ పై వచ్చి ఓటు వేశారు. చెన్నైలోని నీలంకరైలో ఉన్న ఒక పోలింగ్ బూత్ కి ఒక సాధారణ వ్యక్తిలా విజయ్ సైకిల్ మీద వచ్చారు. ఆయన వేగంగా సైకిల్ తొక్కుతూ పోలింగ్ కేంద్రానికి వస్తుండగా రోడ్డుపై అభిమానులు విజయ్ వెంట బైక్ లతో అనుసరించారు. 

హీరో విజయ్ పోలింగ్ కేంద్రానికి సైకిల్ పై వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆయన సైకిల్ మీద రావడంపై నెటిజన్లు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హీరో విజయ్ బిల్డప్ కోసమే సైకిల్ పై వచ్చాడని కామెంట్ చేస్తున్నారు. అయితే పోలింగ్ బూత్ విజయ్ ఇంటికి చాలా దగ్గరగా ఉండటంతోనే ఇతర వాహనాలు ఉపయోగించకుండా సైకిల్ పై వచ్చినట్లు ఆయన సన్నిహితుడు చిన్న చెప్పుకొచ్చారు.   

Leave a Comment