అమిత్ షా, యోగిని చంపుతాం.. సీఆర్పీఎఫ్ కు మెయిల్..!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపుతామంటూ వచ్చిన మెయిల్ బెదిరింపు కలకలం రేపుతోంది. ముంబైలోని సీఆర్పీఎఫ్ కార్యాలయానికి మంగళవారం ఉదయం ఈ మెయిల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను పదవుల నుంచి తొలగించాలని, లేదా చంపేస్తామని మెయిల్ లో పేర్కొన్నారు. 

ఆత్మాహుతి దాడుల ద్వారా యోగి, అమిత్ షాలను చంపేస్తామని హెచ్చరించారు. 11 మంది సూసైడ్ బాంబర్లు సిద్ధంగా ఉన్నారని, వారి ద్వారా ఆ ఇద్దరినీ హతమారుస్తామని పేర్కొన్నారు. అంతేకాదు ప్రార్థనా మందిరాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లోనూ దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది అనే దానిపై వివరాలు తెలియరాలేదు..  

Leave a Comment