బంధమంటే ఇదీ.. భార్యభర్తల అనుబంధానికి నిదర్శనం..!

ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే.. ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే.. ఇదే మధురమైన బంధం.. భార్యకు సేవచేయడం అంటే బానిసగా బతుకున్నామని కాదు.. బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కడవరకూ తోడూ వీడకుండా ఉండటమే సంసారం.. నేటి యువజంటలు క్షణికావేశంలో తీక్షణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. విడాకులు తీసుకోవడమో.. ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు.. అలాంటి జంటలు వీరిని చూసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.. 

వృద్ధాప్యంలోనూ వీరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారో ఈ చిత్రం నిద్శనం.. భార్య ఇబ్బంది పడుతుంటే నేనున్నానంటూ ఆ వృద్ధుడు చేసే పని వారి మధ్య అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన దంపతులు మాద్యం పోచమ్మ, గంగారం బతుకమ్మ పండుగ కోసం భిక్కనూరులోని కుమార్తె ఇంటికి వచ్చారు. పోచమ్మ తన కాలిగోర్లు తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే.. భర్త గంగారం తాను ఉన్నానంటూ భార్యకు గోర్లు తీశాడు..    

Leave a Comment