హీరోయిన్ డ్రస్ చూసి వెంటబడ్డ కుక్కలు.. వీడియో వైరల్..!

రాఖీ సావంత్.. ఈ నటి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటుంది. ఈమెకు కాంట్రవర్సీ క్వీన్ గానూ గుర్తింపు ఉంది. అయితే ఈ నటికి బిగ్ బాస్ సీజన్ 14 మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. మోస్ట్ ఎంటర్ టైనర్ గా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. 

అయితే ఇటీవల తనను మరోసారి బిగ్ బాస్ సీజన్ 15 ఓటీటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. స్పైడర్ ఉమెన్ గెటప్ వేసి, ముంబై వీధుల్లో తిరుగుతూ హాల్ చల్ చేసింది. 

తాజాగా ఈ నటి డిమాండ్ కి బిగ్ బాస్ సైతం దిగొచ్చి సీజన్ 15 ఓటీటీలోనూ అవకాశం కల్పించారు. దీంతో మామూలు కంటే కాస్త ఎక్కువగా ముస్తాబై బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుండగా ఆమెను కుక్కలు వెంటబడ్డాయి. 

భారీ డ్రెస్ తో కారు దిగి సెట్ లోకి అడుగుపెడుతుండగా అక్కడే ఉన్న కుక్కలు ఆమెను వెంబడించాయి. దీనికి సంబంధించిన వీడియోను రాఖీ సావంత్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

 

Leave a Comment