చావుబతుకుల మధ్య ఉన్న రిటైర్డ్ కల్నల్.. ప్రాణాలు కాపాడిన డెలివరీ బాయ్..!

కరోనా మహమ్మారి సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ అందించిన సేవలు చెప్పలేనివి. ఎంతో రిస్క్ చేసి ఆహార పదార్థాలను ఇంటికి చేర్చారు. ఆ సమయంలో వీరిని ఫ్రంట్ లైన్ సిబ్బందిగా గుర్తించారు. అయితే వారి సేవలు ఆహార సరఫరాకు మాత్రమే పరిమితం కాదని నిరూపించాడు ఓ ఫుడ్ డెలివరీ బాయ్. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి నిజమైన సేవకుడిలా నిలిచాడు..  

రిటైర్డ్ కల్నల్ మోహన్ మాలిక్ కుటుంబం ముంబైలో నివాసం ఉంటుంది. గతేడాది డిసెంబర్ 25న మోహన్ మాలిక తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో ఆయన కొడు ఆస్పత్రికి తీసుకుని బయలుదేరాడు. దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు అస్సలు కదల్లేని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో ఆయన కొడుకు సాయం కోసం ఎంతో మంది ద్విచక్రవాహనదారులను అడిగాడు. కాని ఎవరూ స్పందించలేదు.

ఆ సమయంలో స్విగ్గీ డెలివరీ బాయ్ మృణాల్ కిర్ దత్ ఆ పెద్దాయనను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. వెంటనే తన బైక్ పై వారిని కూర్చోబెట్టుకుని ముగ్గురూ ఆస్పత్రికి బయలుదేరారు.. గట్టిగా అరుస్తూ అడ్డుగా ఉన్న వాహనాలను దారి ఇవ్వలని కోరాడు. చివరికి రిటైర్డ్ కల్నల్ ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రికి చేరిన వెంటనే కిర్ దర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు..   

ఇన్నాళ్లు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న పెద్దాయన ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. తనకు కొత్త జీవితాన్ని ఇచ్చిన కిర్ దర్ గురించి ఆరా తీశారు. స్విగ్గీ ప్రతినిధులను సంప్రదించి అతడి అడ్రస్ కనుకున్నారు. తన ప్రాణాలు కాపాడిన డెలివరీ బాయ్ ని రియల్ సేవియర్ గా కొనియాడారు. అతడికి ధన్యవాదాలు తెలిపారు.. పెద్దాయన ప్రాణాలు కాపాడిన డెలివరీ బాయ్ చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.    

 

 

View this post on Instagram

 

A post shared by Swiggy (@swiggyindia)

Leave a Comment