సెకనుకు 2 బిర్యానీలు.. ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీదే హవా..!

ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో బెంగళూరు ముందుండగా.. హైదరాబాద్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ‘స్టాట్ ఈటస్టిక్స్ -2021’ను మంగళవారం ప్రకటించింది. ఏడాదిలో ఈ యాప్ కి వచ్చిన ఆర్డర్ల ఆధారంగా విశ్లేషణ చేసింది. ఈ నివేదికలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. సోమవారం, గురువారం ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఆర్డరు్లు ఎక్కవగా వచ్చినట్లు తెలిపింది.

నివేదికలో వివరాలు:

  • ఇక పిండి పదార్థాలు తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే కీటో డైట్ ఆర్డర్లు 23 శాతం, మొక్కల నుంచి వచ్చే ఆహారం వేగాన్ రుచులు 83 శాతం పెరిగినట్లు నివేదికలు తెలిపింది.  
  • ప్రతి ఒక్కరికీ పసందైన వంటకమైన బిర్యానీ వరుసగా ఆరో ఏడాది అగ్రస్థానం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా గతేడాది నిమిషానికి 90 బిర్యానీల ఆర్డర్లు వస్తే.. ఈ ఏడాది అది 115కి పెరిగింది. అంటే సెకనుకు రెండు బిర్యానీలన్న మాట.. శాకాహార బిర్యానీతో పోలిస్తే చికెన్ బిర్యానీనే 4.3 రెట్లు ఎక్కువగా ఆర్డర్లు ఉన్నాయి. చికెన్ బిర్యానీ ఆర్డర్లలో చెన్నై, కోల్ కతా, లక్నో, హైదరాబాద్ టాప్ లో ఉన్నాయి. 
  • ఇక చిరుతిళ్లో ఈ ఏడాది స్విగ్గీలో 50 లక్షల సమోసాలను ఆర్డర్లు చేశారట. పావ్ బాజీ 21 లక్షలతో రెండో స్థానంలో ఉంది. 
  • మిఠాయిల్లో గులాబ్ జామ్ 21 లక్షలు.. రస్ మలై 12.7 లక్షల ఆర్డర్లు ఉన్నాయి. 
  • దోసెల ఆర్డర్ చేయడంలో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా.. హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాదీయులు ఎక్కువగా చికెన్ బిర్యానీ, చికెన్ 65, పనీర్ బటర్ మసాలా, మసాలా దోశ, ఇడ్లీ ఆర్డర్ చేశారు.   

 

Leave a Comment