స్వదేశీ అంటే అన్ని విదేశీ ఉత్పత్తుల బహిష్కరణ కాదు : మోహన్ భగవత్

స్వాతంత్య్రం అనంతరం దేశ అవసరాలకు అనుగుణంగా ఆర్థిక విధానం రూపొందించబడలేదని, కరోనా వైరస్ అనుభవాల నుంచి కొత్త విలువ ఆధారిత అభివృద్ధి నమునా రావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోమన్ భగవత్ అన్నారు. ఒక వర్చువల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వదేశీ అంటే పూర్తిగా విదేశీ వస్తువులను బహిష్కరించడం కాదని ఆయన పేర్కొన్నారు. పరిస్థితులకు తగినట్టుగా తమకు కావాల్సినవి కొనవచ్చని అన్నారు. 

కోవిడ్ వల్ల గ్లోబలైజేషన్ తగిన ఫలితాలు ఇవ్వదని, ప్రపంచ మంతా ఒకే ఆర్థిక విధానం పనికి రాదని అభిప్రాయపడ్డారు. దేశంలో దొరకని, సంప్రదాయకంగా తయారు కాని టెక్నాలజీని, వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చని మోహన్ భగనత్ స్పష్టం చేశారు. స్వదేశీ అంటే అర్థం దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం అని, విదేశీ పెట్టుబడులపై పరిమితులను విధంచడమని చెప్పారు. 

Leave a Comment