Viral Video: కొడుకును తాళ్లతో కట్టి కంట్లో కారంకొట్టిన తల్లి.. ఎందుకంటే?

కొడుకు మంచిగా చదువుకొని ప్రయోజకుడు కావాలని ఆ తల్లి ఆరాటపడింది. కానీ ఆ కొడుకు మాత్రం చెడు వ్యసనాలకు బానిసయ్యడు. గంజాయికి అలవాటు పడ్డాడు. ఈ అలవాటును వదిలేయాలని ఎంత చెప్పిన కొడుకు వినలేదు. దీంతో కొడుకు ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని అనుకుంది.. తన బిడ్డకు తానే శిక్ష విధించింది. కొడుకును తాళ్లతో స్తంభానికి కట్టేసి కంట్లో కారంపెట్టింది.. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని కోదాడలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కోదాడలోని గాంధీనగర్ కి చెందిన 15 ఏళ్ల అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డాడు. ఇది గమనించిన తల్లి.. వదిలేయాలని ఎన్నోసార్లు కొడుక్కి చెప్పింది. గంజాయి తీసుకుంటే జీవితం నాశనం అవుతుందని చెప్పింది. ఎంత చెప్పిన కొడుకు వినలేదు. గంజాయి అలవాటును మాన్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయినా ఫలితం దక్కలేదు.

ఓ రోజు గంజాయి తీసుకుని అదే మత్తులో ఇంటికి వచ్చాడు. దీంతో కొడుకును ఇరుగుుపొరుగువాళ్ల సాయంతో ఆ తల్లి చెట్టుకు తాళ్లతో కట్టేసింది. ఆ తర్వాత కారం తీసుకొచ్చి అతడి కళ్లలో కొట్టింది. అందరూ చూస్తుండగానే కొడుకును కొట్టింది. కారం చల్లోద్దు అని కుమారుడు అరుస్తుంటే.. లోలోపల కుమిలిపోయిన ఆ తల్లి ఎలాగైనా కుమారుడును దారిలోకి తీసుకురావాలని ఈ పని చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

Leave a Comment