సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే..!

బుల్లితెరపై యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.. కెమెరా ముందు వాళ్ల కెమెస్ట్రీ అబ్బో మామూలుగా ఉండదు.. దీంతో వీళ్లదరి రిలేషన్ గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. వీరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.. అయితే తాజాగా సుడిగాలి సుధీర్ రష్మీని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి..

సుడిగాలి పెళ్లిపై అతడి స్నేహితులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను మాత్రం కాస్త సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సుధీర్ కి ఇప్పటికే 34 ఏళ్లు దాటి పోయాయి. దీంతో వెంటనే సుధీర్ పెళ్లి సంబంధాల వేటలో పడిపోయినట్లు తెలిసింది. తన కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితుల ద్వారా ఓ సంబంధం కుదిరినట్లు సమాచారం. ఆ సంబంధం సుధీర్ కి కూడా బాగా నచ్చిందట.. అందుకే వెంటనే ఓకే చెప్పినట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ యువతి కూడా సుధీర్ సొంత జిల్లాకు చెందిన అమ్మాయే అని ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్ని ప్రచారాలు జరిగినా ఇంకా సుధీర్ మాత్రం తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు. 

Leave a Comment