ప్లీజ్ సార్.. వెళ్లొద్దు.. ఏడుస్తూ రోడ్డెక్కిన విద్యార్థులు..!

పాఠశాల పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది విద్యార్థులు.. ఉపాధ్యాయులు.. తరగతి గదులు.. అంతకు మించి.. గురుశిష్యుల బంధం.. అప్పటి వరకు తమతో ఉన్న ఉపాధ్యాయులు ఇక బడిని విడిచి వెళ్తున్నారంటే.. విద్యార్థులకు కన్నీళ్లు ఆగవు.. అక్కడి వాతావరణ ఒక్కసారిగా భావోద్వేగంతో బరువెక్కిపోతుంది. తాజాగా ఒక ఉపాధ్యాయుడు బడి వదిలి పోతున్నందుకు పాఠశాలలో విద్యార్థులంతా అన్న, పానీయాలు విడిచి పెట్టారు. వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు కూడా బోరున విలపించారు. ఈ ఘటన ఒడిశాలోని నవరంగపూర్ జిల్లా డాబుగాం సమితి మెదన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. 

వివరాల మేరకు డాబుగాం సమితిలో కొద్ది రోజుల క్రితం 27 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. వారిలో మెదన ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న దివాకర బారిక్ ఒకరు. బారిక్ గత 22 ఏళ్లుగా ఇదే పాఠశాలలో పనిచేస్తున్నారు. 5 సంవత్సరాల క్రితం హెచ్ఎంగా ప్రమోషన్ పొంది ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. 

దివాకర బారిక్ తన మంచి మనుసు, సేవలతో విద్యార్థుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ అలవరచడం, ఉత్తమ విద్యార్థులుగా తీర్చదిద్దడంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. అలాంటి టీచర్ బదిలీ కావడంతో విద్యార్థులు తట్టుకోలేక బోరున విలపించారు. వెంటనే హెచ్ఎం దివాకర బారిక్ ట్రాన్స్ ఫర్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట నిరసనకు దిగారు.  

 

Leave a Comment