ప్రభుత్వ పథకం కోసం సోంత చెల్లినే పెళ్లి చేసుకున్నాడు..!

ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన పథకం కింద ఉత్తరప్రదేశ్ లోని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇటీవల సామూహిక వివాహాలు జరిగాయి. ఫిరోజాబాద్ తుండ్లలో అధికారులు సామూహిక వివాహాలు జరిపించారు. ఈ ప్రోగ్రామ్ లో మొత్తం 51 జంటలు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న జంటలకు ఈ పథకం కింద రూ.35 వేల నగదు, ఇంటికి సంబంధించిన కొన్ని సామాన్లు కానుకగా ప్రభుత్వం అందిస్తోంది. 

అయితే ఈ సామూహిక వివాహాల్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పథకం ద్వారా వచ్చే నగదు కోసం సొంత చెల్లినే అన్న పెళ్లిచేసుకున్నాడు. డిసెంబర్ 11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి సొంత చెల్లి మెడలో తాళికట్టి భార్యను చేసుకున్నాడు. తర్వాత ప్రభుత్వం ఇచ్చిన నగదు, ఇతర కానులను తీసుకున్నాడు. 

ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో అసలు విషయం బయటపడింది. పెళ్లి చేసుకన్న వారిద్దరు సొంత అన్న చెల్లెళ్లని గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయాన్ని అధికారులు చెప్పారు. అయితే అప్పటికే వారిద్దరూ పరారైనట్లు తెలిసింది. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తుండ్ల బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి నరేష్ కుమార్ వెల్లడించారు. 

Leave a Comment