ప్రపంచంలోనే వింత శిశువు.. బంధువులు చంపేయమన్నారు.. కానీ ఆ తల్లి ప్రేమ..!

ఈ ప్రపంచంలో జన్యులోపంతో కొంతమంది పిల్లలు పుడుతుంటారు. అలా పుట్టిన పిల్లల రూపాలు చాలా వింతగా ఉంటారు. ప్రపంచంలోనే అతి వింతైన పిల్లవాడు ఆఫ్రికాలోని రవాండలో పుట్టాడు. త్రిభుజాకార తలతో పుట్టిన ఈ బాబు చాలా వింతగా చూసేందుకు చాలా వింతగా, భయంకరంగా  ఉంటాడు.

రవాండాలో బ్యాడ్ జెన్సీ లిబరేట్ అనే మహిళకు జన్యులోపాలతో పిల్లలు పుట్టేవారు. అందులో చివరి వాడు ఈ బాలుడు. ఇతడు నమ్మశక్యం కానీ త్రిభుజాకార తలతో జన్మించాడు. దీంతో లిబరేట్ కు భర్త విడాకులు ఇచ్చాడు. బంధువు కూడా ఆ పిల్లాడిని చంపేయాలని చెప్పారు. కానీ ఆ తల్లి అలా చేయలేదు. గ్రామస్తులు అయితే ఏలియన్, డెవిల్ సన్ అంటే హేళనగా మాట్లాడేవారు.

 అంతే కాదు ఆమెను ఆ గ్రామం నుంచి బయటకు పంపించేశారు. ఇప్పుడు ఆమె వేరే గ్రామంలో ఉంటుంది. ఆమె ఉద్యోగం కూడా వదులుకుంది. ఎంతమంది అడ్డమైన సలహాలు ఇచ్చిన ఆ తల్లిని బిడ్డ నుంచి దూరం చేయలేకపోయారు. కొడుకెలా ఉన్న తల్లికి రాజే అన్నట్లు వింత రూపంలో పుట్టిన ఆ బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంటుంది. ఈక్రమంలో ‘గో ఫండ్ మీ’ అనే చారీటీ సంస్థ ఆ శిశువుకు అమెరికాలో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. 

 

 

Leave a Comment