సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేశారు.. ఐటీ శాఖ ఆరోపణ..!

కరోనా మహమ్మారి సమయంలో తన సేవా కార్యక్రమాలతో ఎంతో హృదయాల్లో నిలిచిపోయారు సోనూసూద్.. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈనేపథ్యంలో గత మూడు రోజులుగా ముంబైలోని ఆయన ఇళ్లు, కార్యాయాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆయన భాగస్వాముల కార్యాలయాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన ఐటీ అధికారులు సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా ఆదాయ పన్ను ఎగ్గొట్టినట్లు ప్రకటించారు.

ఈమేరకు ఐటీ శాఖ అధికారులు వివరాలను వెల్లడించారు. కరోనా ఫస్ట్ వేవ్ లో ఏర్పాటు చేసిన సూద్ ఛారిటీ ఫౌండేషన్ కి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.18.94 కోట్ల విరాళాలు అందాయని, వాటిలో రూ.1.9 కోట్లు మాత్రమే సోనూసూద్ సహాయ కార్యక్రమాలకు ఖర్చు చేశారని ఆరోపించారు. మిగితా డబ్బు ఆయన ఖాతాలోని ఉండిపోయిందన్నారు. ఈ సోదాల్లో రూ.1.8 కోట్ల నగదును సీజ్ చేయడంతో పాటు 11 లాకర్టను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇక సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ ను ఉల్లంఘించారని నిర్ధారించినట్లు చెప్పారు. విదేశీ దాతల నుంచి క్రౌడ్ ఫండింగ్ ద్వారా 2.1 కోట్లు సేకరించారని వెల్లడించారు. మౌలిక వసతులను అభివృద్ధి చేసే లక్నోకి చెందిన ఓ పారిశ్రామిక సంస్థతో కలిసి సోనూసూద్ సంయుక్తంగా పెట్టుబడులు పెట్టరని, ఈ పారిశ్రామిక సంస్థ కార్యకలపాల్లో పలు అవకతవకలు గమనించామని, రూ.65 కోట్ల విలువైన బోగస్ కాంట్రాక్టులు సృష్టించినట్లు తెలుస్తోందని ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు.     

  

Leave a Comment