ఏపీలో మేరీ మాత విగ్రహం ధ్వంసం

ఏపీలో రోజురోజుకు విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. అంతర్వేది రథం కాలిపోవడం, దుర్గగుడి వెండి సింహాలు మాయంపై ఏపీలో దుమారం రేగుతోంది. ఆలయాల్లో వరుస విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈక్రమంలో తాజాగా తూర్పగోదావరి జిల్లాలోని మండపేటలో మేరీమాత విగ్రహం ధ్వంసం చేశారు. మెయిన్ రోడ్డులోని ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో ఉన్న ఈ విగ్రహం ధ్వంసం కావడంతో కలకలం రేపింది. విగ్రహం ధ్వంసం కావడాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. 

ఈ విషయం తెలుసుకున్న ఆ వర్గానికి చెందిన వారు ఆందోలన చేపట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తుండడం ఆందోళనకు గురిచేస్తుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మత విద్వేషాలకు దారితీస్తున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

Leave a Comment