శ్రీవారి ప్రసాదం ధర భారీగా పెంపు.. రూ.100 నుంచి రూ.500కు..!

శ్రీవారి ప్రసాదం జిలేబి-మురుకు సెట్ ధరను భారీగా పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లడ్డూలు, వడల ధరలు పెంచిన టీటీడీ అధికారులు.. ఇప్పుడు జిలేబీ, మురుకుల ధరలను పెంచారు. వీటి ధరను రూ.100 నుంచి రూ.500కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ప్రతి గురువారం తిరుప్పావడ సేవ సమయంలో శ్రీవారికి జిలేబీతో పాటు మురుకులను నివేదిస్తుంటారు. తిరుప్పావడ టికెట్లు కొనుగోలు చేసి సేవలో పాల్గొనే భక్తులకు వీటిని ఇస్తుంటారు. మిగిలిన ప్రసాదాలను అధికారులు, టీటీడీ సిబ్బంది, పోలీస్, విజిలెన్స్ ఇలా వివిధ విభాగాల్లోని వారికి విచక్షణ కోటా కింద రూ.100కి విక్రయించేవారు. అయితే ఈ ధరను రూ.100 నుంచి రూ.500 లకు పెంచాలని గత నెలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆమోదించారు. దీనికి సంబంధించిన తాజా ఉత్తర్వులు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి జారీ చేశారు.    

Leave a Comment