బాలకృష్ణ ఆలపించిన శ్రీరామ దండకం.. మీరు చూడండి..!

విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారాకరామారావు 98వ జయంతి నేడు.. ఈ సందర్భంగా తన తండ్రిని స్మరించుకుంటూ నందమూరి బాలకృష్ణ శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆలపించారు. బాలయ్య నిర్మాణ సంస్థ నందమూరి బాలకృష్ణ ఫిల్మ్స్ ఈ వీడియోను తమ ట్విట్టర్ లో విడుదల చేసింది. ఈ వీడియో అభిమానులను ఎంతగానో అలరిస్తుంది.  

కాగా, మే 28వ తేదీ 1923 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించిన నందమూరి తారకరామారావు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు..

Leave a Comment