‘బింబిసార’గా కల్యాణ్ రామ్.. మరో బాహుబలి అవుతుందా?

నందమూరి కల్యాణ్ రామ్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శుక్రవారం తన కొత్త సినిమా టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ లుక్ మోషన్ పోస్టర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఇందులో కల్యాణ్ రామ్ లుక్, బ్యాక్ డ్రాప్ అన్ని సరికొత్తగా ఉన్నాయి. బాహుబలి లెవల్ లో శత్రు సంహారం చేసిన యోధుడిలా ఇందులో కనిపిస్తున్నాడు.  ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు విశిష్ట్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కేథరిన్ టెస్రా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఎవరీ బింబిసారుడు?

బింబిసార.. కళ్యణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా.. చారిత్రక చిత్రం కావడంతో ఈ బింబిసారుడు ఎవరా అన్న అసక్తి అందరిలోనూ నెలకొంది. మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజవంశ రాజు బింబిసారుడు.. క్రీ.పూ 558లో జన్మించాడు. 15 ఏళ్ల వయస్సులోనే సింహాసనాన్ని అధిష్టించాడు. బింబిసారడుకు 500 మంది భార్యలు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.. బింబిసారుడు బుద్ధుడి సమకాలికుడు..

 

Leave a Comment