అమ్మో..ఏంటిది? పీరియడ్ రక్తాన్ని తాగుతున్న మహిళ..!

మహిళల రుతుక్రమం సమయంలో యోని నుంచి రక్తస్రావం అవుతుంది. ఈ రక్తాన్ని చెడు రక్తంగా లేదా శరీరంలోని ఒక వ్యర్థంగా భావిస్తుంటారు. కానీ ఓ మహిళ మాత్రం పీరియడ్ రక్తాన్ని తాగుతానని చెబుతోంది. ఈ పీరియడ్ రక్తం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపింది.

వివరాల్లోకి వెళ్తే.. స్పెయిన్ లోని బార్సెలోనాకి చెందిన జాస్మిన్ అలీసియా కార్టర్ కి 30 ఏళ్ల మహిళ.. పీరియడ్స్ సమస్యలకు సంబంధించిన సలహాలను తెలియజేస్తుంది. ఇందులో భాగంగా పీరియడ్స్ బ్లడ్ గురించి విచిత్ర వాదను తీసుకొచ్చింది. పీరియడ్స్ రక్తం తాగుతానని చెబుతోంది. పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక కప్పు రక్తం పట్టుకుని దానిని తాగుతానని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. అంతేకాదు ఆ రక్తాన్ని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆమె వాదిస్తోంది. చాలా రోజుల నుంచి పీరియడ్స్ రక్తాన్ని తాగుతున్నానని, తాను ఆరోగ్యంగా ఉన్నానని అంటోంది. 

అంతేకాదు జాస్మిన్ తన పీరియడ్స్ రక్తాన్ని ఫేషియల్ మాస్క్ గా కూడా ఉపయోగిస్తోంది. పీరియడ్ రక్తంలో ప్రోటీన్, ఐరన్, స్టెమ్ సెల్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయని చెబుతోంది.  అయితే జాస్మిన్ చేసే పనికి నెటిజన్లు ఛీ కొడుతున్నారు. ఛీ పీరియడ్స్ రక్తం ఎలా తాగుతారని ఆమెను తిట్టిపోస్తున్నారు. అయతే ఆమె మాత్రం నెటిజన్ల విమర్శలను పట్టించుకోవడం లేదు.  

Leave a Comment