దారుణం: యువతిని ఇంటి నుంచి లాక్కొచ్చి.. బహిరంగంగా సామూహిక అత్యాచారం..!

ఒక యువతిపై బహిరంగంగా సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాక ఆ యువతి జుట్టుపట్టుకొని కొడుతూ నీచంగా ప్రవర్తించారు. ఈ దారుణ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల మేరకు ఢిల్లీలోని కస్తూర్బా నగర్ కి చెందిన 20 ఏళ్ల యువతిని ఓ యువకుడు ప్రేమించాడు. అయితే ఆ యువతి అతడి ప్రేమను అంగీకరించలేదు. దీంతో గతేడాది నవంబర్ లో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఆ యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం అతడి చావుకు ఆ యువతి కారణమని ఆమెపై ద్వేషం పెంచుకున్నారు. ఈక్రమంలో ఆ యువతిని బుధవారం ఇంటి నుంచి లాక్కొచ్చి జుట్టుపట్టుకుని కొట్టారు. కొంత మంది పురుషులు ఆమెపై బహిరంగంగా అత్యాచారం చేశారు. అక్కడు మహిళలు కూడా యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రోత్సహించారు.

ఆ తర్వాత యువతి జుట్టును కత్తిరించి ముఖానికి నలుపు రంగు పూశారు. చెప్పులు, బూట్లతో ఆ యువతిని దారుణంగా కొట్టారు. యువతి మెడలో దండలు వేసి ఊరేగించారు.  ప్రస్తతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment