వీడియోలకు వ్యూస్ రావట్లేదని.. యూట్యూబర్ ఆత్మహత్య..!

ఓ యూట్యూబర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. తన గేమ్ ఛానల్ కు వ్యూస్ పెరగడం లేదని డీనా(24) అనే యువకుడు బిల్డింగ్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని సైదాబాద్ క్రాంతి నగర్ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఐఐటీలో చదువుతున్నాడు. అయితే ఆత్మహత్యకు ముందు ఆ యువకుడు సూసైడ్ నోట్ లెటర్ అప్ లోడ్ చేసినట్లు తెలుస్తోంది.

డీనా ఐఐటీ గ్వాలియర్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ లో Sleflo అనే ఓ గేమింగ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. కొంత కాలంగా అతడి ఛానెల్ కి అనుకున్నంతగా వ్యూస్ రావడం లేదు. దీంతో ఆందోళన చెందిన డీనా తన ఆవేదనను యూట్యూబ్ లో పంచుకున్నాడు. అనంతరం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment