తెలంగాణలో సోనూ సూద్ కు ఆలయం..!

సినిమాలో విలన్ గా కనిపించే సోను సూద్ రియల్ లైఫ్ లో హీరో అనిపించుకున్నారు. కరోనా సమయంలో ఎంతో మంది వలస కూలీలను ఆదుకున్నారు. వారిని స్వస్థలాలకు చేర్చడంలో సహాయపడ్డారు. ఇప్పటికీ కూడా తనను సంప్రదించిన వారందరికీ సాయం చేస్తూ రియల్ లైఫ్ హీరోగా, ఆపద్భాంధువుడిగా నిలుస్తున్నారు. అందుకే సోనుసూద్ ను కలియుగ కర్ణుడిగా కీర్తిస్తున్నారు. 

తాజాగా తెలంగాన ప్రజలు సోనుసూద్ కు అరుదైన గౌరవం కల్పించారు. ఆయన గౌరవార్థంగా ఆలయాన్ని సైతం నిర్మించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలోని దుబ్బా తండాలో జరిగింది. సోనుసూద్ విగ్రహం తయారు చేసిన శిల్పి, స్థానికుల సమక్షంలో ఆదివారం ఈ గుడి ప్రారంభోత్సవం చేశారు.  ఈ గుడి నిర్మాణానికి స్థానికులు, సిద్దపేట జిల్లా అధికారులు కూడా సహకరించారు. కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న సోనూ సూద్ ను కీర్తించుకుంటూ ఈ ఆలయం నిర్మించినట్లు దుబ్బ తండా ప్రజలు వెల్లడించారు. 

Leave a Comment