బిగ్ బాస్-4 విన్నర్ అభిజిత్..!

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్-4 గ్రాండ్ ఫినాలే ఆదివారం ముగిసింది. ఈ షో విజేతగా అభిజిత్ నిలిచాడు. తనదైన ఆట తీరు, నేర్పుతో తెలుగు ప్రేక్షకుల మనసుల్సి దోచుకున్న అభిజిత్, బిగ్ బాస్ ప్రశంసలను కూడా దక్కించుకున్నాడు. చివరికి విజయం అభిజిత్ నే వరించింది. ఈ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజిత్ బిగ్ బాస్-4 ట్రోఫీని అందుకున్నాడు. 

బిగ్ బాస్-4 రన్నరప్ గా అఖిల్ నిలిచాడు. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొనగా, వారిలో వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్ అయ్యారు. చివరకు అఖిల్, అభిజిత్, సొహైల్, హారిక, అరియానాలు టాప్-5లో ఉన్నారు. వీరిలో హారిక, అరియానాలు ఎలిమినేట్ అవ్వగా, ముగ్గిరిలో ఎవరైనా ఒకరు రూ.25 లక్షలు తీసుకొని వెళ్లిపోవచ్చని నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ కు అంగీకరించిన సొహైల్ రూ.25 లక్షలు తీసుకున్నాడు. దీంతో అభిజిత్ ప్రైజ్ మనీలో సగానికి కోత పడింది.   

 

Leave a Comment