పౌరసత్వ సవరణ చట్టంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!

పశ్చిమ బెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే CAA అమలును పరిశీలిస్తామని ప్రకటించారు. 

కరోనా మహమ్మారి కారణంగా CAAకు సంబంధించిన నియమనిబంధనలు ఇంకా రూపొందించలేదని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించిన తర్వాత CAA అమలుపై ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. 

చొరబాటు దారులను మమతా బెనర్జీ ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వయ్ పై జరిగిన దాడికి తృణముల్ కాంగ్రెస్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

Leave a Comment