టైలర్ గా మారిన సోనూసూద్..!

లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను సొంత ప్రాంతాలకు చేర్చాడు సోనూసూద్. తన సొంత ఖర్చుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. ఎవరికైన ఇబ్బంది ఉందని తెలిస్తే చాలు వారి గురించి తెలుసుకుని తనకు చేతనైనా సాయం అందించాడు. తన సేవా కార్యక్రమాలతో సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు.

కాగా, సోనూసూద్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ సినిమా షూటింగ్ లొకేషన్ లో సోనూసూద్ టైలర్ గా మారాడు. అక్కడే ఉన్న ఓ క్లాత్ తీసుకుని ప్యాంట్ కుట్టేందుకు ప్రయత్నించాడు. 

అయితే అది అనుకున్నట్టుగా రాకపోవడంతో ఫన్నీ కామెంట్ తో వీడియో పోస్ట్ చేశాడు. ‘సోనూసూద్ టైలర్ షాపు. ఇక్కడ ఉచితంగా దుస్తులు కుట్టబడును. కానీ ప్యాంట్ కాస్త నిక్కర్ గా కూమా మారే అవకాశాలు ఉన్నాయి. దీనికి మా గ్యారంటీ లేదు’ అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

  

Leave a Comment