ఆకట్టుకుంటున్న ‘గో కరోనా’ సాంగ్..!

‘ఆ!’ ఫేం ప్రశాంత్ వర్మ తెలుగులో తెరకెక్కిస్తున్న మొట్టమొదటి జాంబి సినిమా ‘జాంబిరెడ్డి’.. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ సజ్జ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ఈ సినిమాలో ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

కాగా ఈ సినిమా యూనిట్ ప్రచార స్పీడ్ ను పెంచింది. తాజాగా ‘గో కరోనా’ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. లాక్ డౌన్ సమయంలో జరిగిన ఇన్సిడెన్స్ ఆధారంగా ఈ పాటను చిత్రీకరించారు. దీనికి మామా సింగ్ లిరిక్స్ అందించగా, మార్క్ కె.రామిన్ ట్యూన్ అందించారు. ఈ పాటను ర్యాప్ పాడారు. ఈ సాంగ్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. 

You might also like
Leave A Reply

Your email address will not be published.