ఢిల్లీలో వ్యాక్సిన్ వేసుకున్న 51 మందికి అస్వస్థత..!

కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లో శనివారం ప్రారంభమైంది. తొలి దశలో దేశ వ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా ఇచ్చారు. అయితే టీకా తీసుకున్న కొంత మందిలో దుష్ప్రభావాలు తలెత్తినట్లు అధికారులు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో 51 మంది స్వల్పంగా అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. 

ఒకరిలో తీవ్రమైన లక్షణాలు కనిపించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఐసీయూలో చేర్చారు. కరోనా టీకా తీసుకున్న వారిలో తలనొప్పి, ఛాతీలో పట్టేసినట్లు ఉండడం వంటి లక్షణాలు బయటపడ్డాయని ఢిల్లీలోని ఉత్తర రైల్వే సెంట్రల్ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. రాజస్థాన్ రాష్ట్రంలోనూ 21 మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Leave a Comment