ప్రజలకు సాయం చేసేందుకు రూ.10 కోట్ల ఆస్తిని తాకట్టు పెట్టిన సోనుసూద్..!

కరోనా లాక్ డౌన్ లో సోనుసూద్ వలస కార్మికుల పాలిట దేవుడయ్యాడు. ఎంతో మందిని తమ స్వస్థలాలకు చేర్చాడు. ఎవరు ఏ సాయం అడిగినా చేశాడు.  కూట్టాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలు కూడా చేయలేని పనులను సోను సూద్ చేశాడు. దీంతో సోనుసూద్ దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 

అయితే సోను సూద్ గురించి ఎవరికీ తెలియని విషయం ఏంటంటే..ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సోను సూద్ ఎంతగానో ఖర్చు చేశాడు. దీని కోసం తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టినట్లు తెలిసింది. ముంబైలోని జుహులో తన ఎనిమిది ఆస్తులను తాకట్టు పెట్టినట్లు సమాచారం.

మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం సోనుసూద్ తన రెండు షాపులు, ఆరు ఫ్లాట్స్ ను తాకట్టు పెట్టి రూ.10 కోట్లు అప్పు తీసుకున్నారు. ఈ విషయాన్ని జేఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ రితేశ్ మెహతా ధ్రువీకరించారు. ఎదుటి వారి కోసం ఇంత గొప్ప పనిచేసిన వారిని తన జీవితంలో ఎప్పుడూ చేడలేదని ఆయన తెలిపారు.  

Leave a Comment