హీరోగా మారిన విలన్..

Sonu Sood ..ఇది పరిచయం అక్కర్లేని పేరు. ‘వదల బొమ్మాలి వదలా’ అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో విలన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తెలుగు సినిమాల్లో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా..ఎందుకంటే విలన్ గా ఉన్న సోను సూద్ ఇప్పుడు సడన్ గా హీరో అయిపోయారు. 

అవునండి ఇది నిజం. అయితే సినమాల్లో కాదండోయ్..ముంబైలో చిక్కుకున్న వలస కార్మికులను ఆదుకోవడంలో..  కోవిడ్-19 కారణంగా ముంబైలో చిక్కుకున్న వేలాది మంది నిస్సహాయ వలస కార్మికులను ఆదుకోవడంలో నటుడు Sonu Sood ముందున్నారు. 

వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా Sonu Sood మెస్సీయగా అవతరించాడు. ‘ఘర్ భేజో’ అని పిలిచే వారిన తన చొరవతో ఇప్పటి వరకు 20 బస్సుల్లో 750 మందికిపైగా వలస కార్మికులను కర్ణాటక మరియు యూపీకి పంపారు. 

సోను సూద్ చేస్తున్న ఈ సహాయానికి ట్విట్టర్ లో ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం Sonu Sood ట్విట్టర్ హాట్ టాపిక్ గా ఉన్నారు. చాలా మంది ట్విట్టర్ ద్వారా సోను సూద్ కు సహాయం కోసం కోరుతున్నారు. ఆయన చేస్తున్న సేవకు చాలా మంది ప్రముఖులు కూడా ఆయనను ప్రశంసిస్తున్నారు. ప్రజలు ఇతర బాలీవుడ్ నటులతో సోను సూద్ ను పోలుస్తున్నారు. వలస కార్మికులను తరలించడంలో ఏ బాలివుడ్ హీరో కూడా ముందుకు రాలేదు. Sonu Sood దగ్గరుండి మరీ వలస కార్మికులను తరలిస్తుండటంతో ప్రజల గుండెల్లో ఆయన హీరో అయిపోయారు.

Leave a Comment