సోనూసూద్ మరో సాయం..!

కరోనా లాక్ డౌన్ నుంచి ఎంతో మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఓ చిన్నారికి సాయం చేసి ప్రాణం పోశారు. పశ్చిమ గోదావరి జిల్లా అన్న దేవరపేటకు చెందిన రామన వెంకటేవ్వరరావు, దేవి కూలీలకు ఎనిమిది నెలల పిల్లోడున్నాడు. 

ఆ చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకునే స్థోమత కూడా లేక తల్లిదండ్రులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడి సాయంతో చిన్నారి తల్లిదండ్రులు సోనూసూద్ ట్రస్ట్ ను ఆశ్రయించారు. వెంటనే సోనూసూద్ బాలుడిని ముంబైలోని నారాయణ గుండె ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. బాలుడికి గుండె ఆపరేషన్ కు అయ్యే ఖర్చును అంతా తానే భరించారు. అలా సోషల్ మీడియాలో మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు. 

Leave a Comment