దేశంలో అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వట్లేదంట..!

మొబైల్ ఫోన్ల వినియోగంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు వెనుకబడి ఉన్నారు. మన దేశంలో 42 శాతం మంది టీనేజీ అమ్మాయిలకు రోజులో కేవలం ఒక గంట మాత్రమే మొబైల్ చూసేందుకు తల్లిదండ్రులు అనుమతిస్తున్నారు. సెంటర్ ఫర్ కేటలైజింగ్ చేంజ్ అనే సంస్థ, డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ కలసి నిర్వహించిన సర్వేలో మన దేశంలో అమ్మాయిలకు ఫోన్ ఇవ్వట్లేదని తేలింది. దేశంలోని 10 రాష్ట్రాల్లో 4,100 మంది టీనేజ్ అమ్మాయిలపై నిర్వహించిన సర్వే వివరాలను జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం వెల్లడించింది. 

సర్వేలోని వివరాలు..

  • దేశంలో చాలా మంది అమ్మాయిలకు డిజిటల్ పరికరాలు అందుబాటులో లేవు. 
  • టీనేజ్ అమ్మాయిలు ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలు వాడడం వల్ల దారి తప్పుతారని పెద్దలు భయపడుతున్నట్టు తెలుస్తుంది. 
  • అలాగే డిజిటల్ వినియోగం తమ అమ్మాయిల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందన్న భయం కూడా తల్లిదండ్రుల్లో ఉంది. 
  • కర్నాటకలో 65 శాతం అమ్మాయిలకు డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. హర్యానాలో చాలా తక్కువ శాతం అమ్మాయిలు డిజిటల్ పరికరాలను వినియోగిస్తున్నారు.  

Leave a Comment