చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించిన సోనూసూద్..!

కరోనా కష్టకాలంలో ఎంతో మంది ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. తమకు కష్టం వచ్చిందని చెబితే చాలా వారికి ఆదుకుంటున్నాడు. తాజాగా సోనూసూద్ దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు. 

ఖమ్మం జిల్లాకు చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులు.. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. బాబుకు పుట్టుకతోనే గుండెల్లో సమస్య ఉంది. బాబు ఆపరేషన్ కోసం రూ.6 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. అయితే వీరి వద్ద అంత డబ్బు లేదు. కృష్ణ ఓ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేసుకుంటున్నాడు. దీంతో బాబుకు వైద్యం కోసం డబ్బు లేకపోవడంతో తల్లడిల్లిపోయాడు.. 

ఈక్రమంలో ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నారు. దీంతో వీరు సినీ నటుడు సోనూసూద్ కు విషయాన్ని వివరించారు. దీంతో వెంటనే స్పందించిన సోనూసూద్ వారిని ముంబై రావాలని చెప్పాడు. అక్కడ వాడియా ఆస్పత్రిలో ఆ బాబుకు శనివారం గుండె ఆపరేషన్ చేయించాడు. ఆపరేషన్ కూడా విజయవంతమైంది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు. తమ బాబుకు ప్రాణం పోసిన సోనూసూద్ కు కృష్ణ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.  

Leave a Comment