మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్తున్నారా? కారణాలు ఇవే కావచ్చు..!

ఈమధ్య చాలా మంది అతి మూత్ర వ్యాధితో బాధపడుతున్నారు. కొందరు గంట గంటకు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. రాత్రి పూట రెండు సార్ల కంటే ఎక్కువ సార్లు మూత్రం పోసేందుకు నిద్ర లేవడం చేస్తుంటారు. ఇక కొందరు ఉన్నట్టుండి అర్జెంటుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. మూత్రం ఆపుకోలేకపోతారు. మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్లడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇలా మూత్రం ఎక్కువ సార్లు వెళ్లడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం…

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్:

మూత్రం ఎక్కవసార్లు వెళ్లడానికి  యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా మూత్రాశయ ఇన్ఫెక్షన్ కూడా ఒక కారణం. మూత్ర పిండాలు, మూత్ర నాళాలు, మూత్రాశయం లలో సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూత్రం ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. 

డయాబెటీస్:

డయాబెటీస్ ఉన్న వారు ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తుంటారు. శరీరంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. అది మూత్రం ద్వారా బయటకు పోతుంది. నీళ్లు కూడా ఎక్కువగా తాగుతుంటారు. సాధారణం కన్న ఎక్కువ సార్లు మూత్ర విసర్జనుకు వెళ్తుంటే షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. 

థైరాయిడ్:

ఇక థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వారు కూడా ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వైద్యుడిని సంప్రదించి థైరాయిడ్ టెస్టు చేయించుకోవాలి. 

ప్రొస్టేట్ క్యాన్సర్:

ప్రొస్టేట్ క్యాన్సర్ సాధారణంగా పురుషులను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రొస్టేట్ విస్తరించడం వల్ల తరుచుగా మూత్ర విసర్జన, నొప్పి లేదా మూత్ర విసర్జన సమయంలో మంట లేదా మూత్ర విసర్జన ఆపడం లేదా ప్రారంభించడం వంటి సమస్యలు వస్తాయి. 

కిడ్నీ స్టోన్స్:

కిడ్నీల్లో స్టోన్స్ ఉంటే కూడా ఎక్కువసార్లు మూత్ర విసర్జను వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వైద్యుడిని కలిస్తే అసలు సమస్య ఎక్కడ ఉందో గుర్తిస్తారు.

ఓవర్ యాక్టివ్ బ్లాడర్:

ఓవర్ యాక్టివ్ బ్లాడర్ సమస్య ఉంటే కూడా తరుచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. అంటే మూత్రాశయం నిండి తరుచుగా మూత్రం రావొచ్చు. మూత్రానికి వెళ్లిన కూడా మళ్లీ వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. బ్లాడర్ లో మూత్రం కొద్ది శాతం మిగిలిపోతుంది. దీంతో బ్లాడర్ అనేది తొందరగా నిండి మూత్రం వస్తుంది.. ఈ కారణాలను గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే అతి మూత్ర సమస్య నుంచి బయటపడవచ్చు.  

Leave a Comment