Sonu Sood Birthday: హ్యాపీ బర్త్ డే రియల్ హీరో

కరోనా మహమ్మారి ప్రారంభమైన్పటి నుంచి నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూ సూపర్ హీరోగా మారారు సోనూసూద్. దేశంలో వేలాది మంది వలసదారులకు నేనున్నానంటూ భరోెసా ఇచ్చడు. వలస కార్మికులకు, దినసరి కూలీలకు ఆర్థికంగా, వైద్య పరమైన సహాయం అందించాడు. కష్టమొచ్చిందని చెప్పుకున్న ప్రతి ఒక్కరికీ అండగా నిలిచాడు. 

సోనూసూద్ ను ప్రజలు దైవంగా భావిస్తున్నారు. ఆయన చేసిన మంచి పనులకు గుర్తుగా తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా ప్రజలు గుడి కూడా కట్టి పూజిస్తున్నారు. మరి కొంత మంది తమ షాపులకు సోనూసూద్ పేరును పెట్టుకుని అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరికొందరు వందల కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి తమ అభిమాన హీరోను కలుసుకుంటున్నారు. 

కాగా, సోనూసూద్ శుక్రవారం తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. సోనూసూద్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, పలువురు సినిమా తారలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. 

Leave a Comment