పదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే..!

ఒడిశా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో గంజాం జిల్లాలోని బంజనగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి ఓ ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసింది. దీంతో అక్కడి సిబ్బంది ఎమ్మెల్యే సందర్శనకు వస్తున్నారని అనుకున్నారు. తర్వాత ఎమ్మెల్యే ఎందుకు వచ్చారో తెలుసుకుని అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఎమ్మెల్యే సెలబ్రెటీగా కాకుండా ఓ విద్యార్థిలాగా పదో తరగతి పరీక్షలు రాశారు. 

కరోనా నేపథ్యంలో ఒడిశా సర్కారు ఈ ఏడాది అందరినీ పాస్ చేసింది. తాము కేటాయించిన మార్కులు నచ్చనివారు పరీక్షలు రాసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈనేపథ్యంలో గంజాం జిల్లాలో శుక్రవారం మెట్రిక్ పరీక్షలు(పదో తరగతి) ప్రారంభమయ్యాయి. కాగా తొలి రోజు పరీక్షకు సురడా నియోజకవర్గానికి చెందిన బీజేడీ ఎమ్మెల్యే పూర్ణచంద్ర హజరయ్యారు. ఆయన దూరవిద్య విధానంలో పది చదివారు. ఎక్కువ మార్కుల కోసం పరీక్షలు రాసేందుకు వచ్చారు. ఆయన మూడుసార్లు సురాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

  

 

Leave a Comment